తెలంగాణ రాష్ట్రంలో దళితులకు దళిత బంధు ప్రవేశపెట్టిన విధంగా బీసీ బంధు ప్రవేశ పెట్టాలని బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు . తెలంగాణ రాష్ట్రంలోని 65 లక్షల బిసి కుటుంబాలలో 48 లక్షల బీసీ కుటుంబాలు దారిద్రరేఖకు దిగువన ఉన్నట్లు సమగ్ర కుటుంబ సర్వే లో తేలింది, కావున తెలంగాణ రాష్ట్రంలో బిసి బంధు ప్రవేశపెట్టి ప్రతి బిసి బిడ్డకు పది లక్షల రూపాయల ఇవ్వాలని బీసీ దల్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని బీసీలను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పై ఉందని, బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయి. తాము దళిత బంధువుకు వ్యతిరేకం కాదని , తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం అని ఈ సంధర్భంగా తెలిపారు. దళిత బంధు తరహాలో బిసి బందు ప్రవేశపెట్టి బిసి బిడ్డలను ఆదుకోవాలని లేనియెడల బీసీ దళ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. చట్టసభల్లో కూడా బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న అడిషనల్ డీసీపీ జయరాం
గుట్టల బేగంపేట్ వినాయకుడిని దర్శించుకున్న ఏసీపి జయరాం శేర్లింగంపల్లి మండలంలోని గుట్టల బేగంపేట్ లో భారీ వినాయకుడిని మాదాపూర్ అడిషనల్ డీసీపీ జయరాం దర్శించుకున్నారు .అనంతరం ఆయన...
Read more