ఐఎన్ఎస్ కల్వరి:
మేడిన్ ఇండియా తొలి స్కార్పియన్ ఐఎన్ఎస్ కల్వరి జలాంతర్గామి గురువారం నౌకాదళంలో చేరింది. ఉదయం దీనిని నౌకాదళానికి అప్పగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు.
ఈ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్‌ను ఫ్రాన్స్ నిర్మాణ సంస్థ సహకారంతో నిర్మించారు. 1.566 టన్నుల బరువైన ఈ సబ్ మెరైన్ టైగర్ షార్క్ తరహాలో హిందూ మహాసముద్రంలో డీప్ సీ ప్రిడేటర్‌గా పని చేయనుంది.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. భారత్ – ఫ్రాన్స్ మధ్య వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఐఎన్ఎస్ కల్వరి ఒక చక్కటి ఉదాహరణ అన్నారు.
సముద్రమార్గం ద్వారా ప్రవేశించే ఉగ్రవాదం, డ్రగ్స్ రవాణా, అక్రమ చేపల వేటను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో భారత్ మరింత కీలక పాత్ర పోషించనుందన్నారు.