ఏషియన్ గేమ్స్‌లో ఇండియాకు మరో గోల్డ్ మెడల్ దక్కింది. ఈసారి రెజ్లింగ్ మహిళల విభాగంలో వినేష్ ఫొగాట్ చరిత్ర సృష్టించింది. 50 కేజీల ఫ్రీైస్టెల్ రెజ్లింగ్ కేటగిరీలో ఆమె స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
ఫైనల్లో జపాన్‌కు చెందిన ఇరీ యుకిపై 6-2 తేడాతో వినేష్ విజయం సాధించింది. ఏషియన్ గేమ్స్‌లో ఆమె గోల్డ్ మెడల్ సాధించడం ఇదే తొలిసారి. గతంలో కామన్వెల్త్ గేమ్స్ ఆమె రెండు గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. ఏషియన్ గేమ్స్ రెండో రోజు ఇండియా ఖాతాలో రెండు మెడల్స్ చేరాయి. ఇప్పటికే షూటింగ్ ట్రాప్ ఈవెంట్‌లో లక్షయ్ సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.
#GoldenGirl @Phogat_Vinesh 🥇#TeamIndia's #VineshPhogat brings home the second Gold for India as defeated Japanese #IrieYuki in the Women's 50kg Freestyle Wrestling final by 4-2 at the #AsianGames2018 #Congratulations #VineshPhogat 🇮🇳👏#IAmTeamIndia pic.twitter.com/RSc3Uyc110
— Team India (@ioaindia) August 20, 2018