రోజు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సర్దార్ నగర్ శ్రీ సాయి కిడ్స్ విద్యాలయం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ర్యాలీని ప్రారంభించిన అనంతరం జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో అల్లపూర్ డివిజన్ వార్డు కార్యాలయం నుండి గాయత్రి నగర్ గాంధీ విగ్రహము వరకు నిర్వహించిన ర్యాలీలో జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణలో ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఎస్ఆర్పి సురేష్, ఎస్ ఎఫ్ ఎ లు శానిటేషన్ సిబ్బంది అల్లాపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అనుబంధ కమిటీ అధ్యక్షులు, అసోసియేషన్ అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more