స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ 2017..తెలంగాణకు రెండు అవార్డులు
ఇండియాటుడే ఆధ్వర్యంలో స్టేట్ ఆఫ్ ది స్టేట్స్-2017 కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులు వచ్చాయి. ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ, స్వచ్ఛత విభాగాల్లో తెలంగాణకు అవార్డులు లభించాయి. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా మంత్రులు కేటీఆర్, జోగురామన్న అవార్డులను అందుకున్నారు.