ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లను (ఐపిపిబి) సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 23 సర్కిళ్లలో 115 యాక్సెస్ కేం ద్రాల్లో ఐపిపిబి సేవలను ప్రారంభించనున్నా రు. హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వర భవన్‌లో గవర్నర్ ఇఎస్‌ఎల్.నరసింహన్ ఐపిపిబి బ్యాంక్ ప్రారంభించగా, వివిధ సర్కిళ్ల పరిధిలో ఎంపీలు, ప్రజాప్రనిథులు ప్రారంభిస్తారని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్‌లోని డాక్ సదన్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం మీడియా సమావేశంలో చంద్రశేఖర్ వివరాలను వెల్లడించారు.
తొలుత ఐపిపిబిని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తారని, దీనిని అన్ని రాష్ట్రాలలో లైవ్ టెలికాస్ట్‌ను వీక్షిస్తామని, ఆతర్వాత రాష్ట్ర స్థాయిలో ప్రారంభోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రస్తుత ఏడాది డిసెంబర్ 31 నాటికి అన్ని పోస్ట్ ఆఫీసులలో ఐపిపిబి యాక్సెస్ కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుతం పోస్టాఫీసులో రూ.40 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని, రూ.17 కోట్లు సేవింగ్ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని ఆయన వివరించారు. దేశ వ్యాప్తంగా 650 పోస్టాఫీసు శాఖలు ఉండగా, 3250 యాక్సెస్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ బ్యాంక్ సేవలు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్నాయని, ఇది ప్రపంచంలోనే పెద్ద బ్యాంక్‌గా నిలువబోతుందని చెప్పారు.