న్యూఢిల్లీ : కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను రూ. 27,84,200 కోట్లకు అంచనా వేశారు.
-పెన్షన్లు – 1,74,300 కోట్లు
-రక్షణ రంగం – 3,05,296 కోట్లు
-ప్రధాన సబ్సిడీల కోసం – 2,96,684 కోట్లు
-వ్యవసాయం, దాని అనుంబంధ రంగాలకు – 1,49,981 కోట్లు
-వాణిజ్యం మరియు పరిశ్రమలకు – 27,660 కోట్లు
-ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధి కోసం – 3,000 కోట్లు
-విద్యకు – 93,848 కోట్లు
-ఇంధన రంగానికి – 44,101 కోట్లు
-విదేశీ వ్యవహారాల శాఖకు – 16,062 కోట్లు
-ఆర్థిక శాఖకు – 19,812 కోట్లు
-ఆరోగ్య రంగానికి – 63,538 కోట్లు
-హోంశాఖకు – 1,03,927 కోట్లు
-ఇంటరెస్ట్ – 6,65,061 కోట్లు
-ఐటీ మరియు టెలికాం – 21,549 కోట్లు
-ప్లానింగ్ మరియు స్టాటస్టిక్స్ – 5,594 కోట్లు
-గ్రామీణాభివృద్ధికి – 1,38,962 కోట్లు
-సాంకేతిక శాఖకు – 26,237 కోట్లు
-సాంఘిక సంక్షేమ శాఖకు – 49,337 కోట్లు
-ట్యాక్స్ అడ్మినిస్ర్టేషన్ కు – 1,17,285 కోట్లు
-రాష్ర్టాల బదిలీలకు – 1,66,883 కోట్లు
-రవాణా వ్యవస్థకు – 1,56,187 కోట్లు
-కేంద్ర పాలిత ప్రాంతాలకు – 15,042 కోట్లు
-పట్టణాభివృద్ధికి – 48,032 కోట్లు
-ఇతర రంగాలకు – 75,822 కోట్లు
ఎన్నికల ముందు వేతన జీవులకు మోదీ సర్కారు భారీ ఊరటనిచ్చింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా రెట్టింపు చేస్తూ.. మధ్యతరగతి ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. ఇప్పటివరకు వార్షికాదాయం రూ. 2.50 లక్షలు దాటితే ఉద్యోగులు పన్ను కట్టాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ పరిమితిని ఏకంగా రూ. 5 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, అదేవిధంగా గృహరుణాలు, ఇంటి అద్దెలు, ఇన్సురెన్స్‌లు కలిపి 6.50 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండబోదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న మూడు కోట్ల మంది మధ్యతరగతి ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇక, స్టాండర్డ్ డిడక‌్షన్ రూ.50 వేలకు పెంచినట్టు ప్రకటించిన గోయల్.. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ 10 వేల నుంచి 40 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు. నెలకు 50 వేల జీతం వరకు టీడీఎస్ వర్తించబోదని, సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై రూ. 2.50 లక్షల వరకు పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఇవన్నీ మధ్యతరగతి ఓటర్లను సంతృప్తిపరిచే నిర్ణయాలే కావడం గమనార్హం.
అదేవిధంగా 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు, దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 150 జిల్లాలపై ప్రత్యేక దృష్టి, దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్, త్వరలోనే హరియాణలో 22వ ఎయిమ్స్ ఏర్పాటు, అంగన్‌వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు, ఈఎస్‌ఐ పరిధి 15 వేల నుంచి 21 వేలకు పెంపు తదితర ప్రతిపాదనల ద్వారా మధ్యంతర బడ్జెట్‌లో మోదీ సర్కారు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తోంది.