కమలామిల్స్ సముదాయంలో ఘోర అగ్నిప్రమాదం
ముంబైలో లోయర్‌పరేల్‌లోని కమలామిల్స్ సముదాయంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
కమలామిల్స్ సముదాయంలో ఓ భవనం మూడో అంతస్థులో మంటలు చెలరేగుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
బాధితులను అధికారులు పరామర్శించారు. ఆ ప్రాంతంలో బాధితుల రోదనలు మిన్నంటాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.