ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపైన మంత్రిమండలి చర్చించి నిర్ణయాలు తీసుకున్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
మున్సిపాలిటీల అభివృద్ధి కోసం చేపట్టవల్సిన చర్యలమీద కేబినెట్ చర్చించింది. హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీల పరిధిలో మంచినీటి సమస్యపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా మరో రూ. 1200 కోట్లను మంజూరు చేసింది. నీటి ఎద్దడి నివారణకై తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.
తెలంగాణ పట్టణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో గృహ నిర్మాణాల కోసం అభివృద్ధి చేసే లే- అవుట్లలో, లాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయాలనే అంశం పై కేబినెట్ చర్చించింది. అందుకు సంబంధించిన అవకాశాలను అన్వేషించాలని, విధి విధానాలపై దృష్టిసారించాలని, మున్సిపల్ శాఖ అధికారులను కేబినెట్ ఆదేశించింది.