ఉప్పల్ : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ లోని లక్ష్మినారాయణ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మూడు వేర్వేరు బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహిం చారు. బోనాల పండుగ సందర్భంగా వైన్ షాపులు, బార్లను మూసి వేసినప్పటికీ అక్రమంగా మద్యం విక్రయిస్తున్న లక్ష్మినారాయణ కాలనీకి చెందిన నర్సింహా గౌడ్, ముద్దగొని సందీప్ గౌడ్, రంగు శ్రీనివాస్ గౌడ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి మొత్తం 588 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి
క్రీడల్లో రాణించి దేశానికే పేరు తేవాలి క్రీడలో గెలుపోటుములను సమానంగా స్వీకరించాలి క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి...
Read more