విమానంలో ప్రయాణించేందుకు విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు తనిఖీ అధికారులకు పది రకాల ఐడెంటిటీ కార్డులను చూపించవచ్చని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల్లోకి ప్రవేశించాలంటే ప్రయాణికులు పాస్‌పోర్టు, ఓటరు ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, సర్వీస్ ఐడీ, స్టూడెంట్ ఐడీ కార్డు, ఫోటోతో ఉన్న జాతీయ బ్యాంకు ఖాతా పాస్ బుక్, పెన్షన్ కార్డు, లేదా ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్లు, వికలాంగుల మెడికల్ సర్టిఫికెట్లలో ఏదో ఒకదాన్ని తప్పనిసరిగా తీసుకురావాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులు కోరారు. ఈ పది రకాల ఐడీ కార్డులు లేకుంటే ఎవరైనా కేంద్ర, రాష్ట్రప్రభుత్వ గజిటెడ్ ఆఫీసరు తన లెటరు ప్యాడ్ పై ఫోటో అటెస్టేషన్ తో పాటు ఇచ్చే లేఖ అయినా విమానాశ్రయాల్లో ప్రవేశం కోసం చూపించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సూచించింది. శిశువులకు మాత్రం ఈ గుర్తింపు కార్డు లేకున్నా విమానాశ్రయాల్లోకి అనుమతిస్తామని అధికారులు వివరించారు.
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more