హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ ప్రస్తుతం నిర్మాణ స్థాయిలో ఉంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో దీని నిర్మాణం చేపట్టారు. ఈ దశలో దాదాపుగా ప్రతి కిలోమీటరుకు ఒక స్టేషనుతో 72 కిలోమీటర్ల దూరాన్ని కలుపుతుంది. ఇది హైదరాబాదు రవాణాకు ఒక కొత్త నిర్వచనం ఇవ్వబోతుంది.
మెట్రో రైలు వినియోగంలోకి వస్తే ఇది ప్రపంచంలో అతి ఎత్తైన మెట్రో రైలుగా పేరు సంపాదిస్తుంది. ఇది హైదరాబాదును ఆధునికంగా మరియు గ్రీన్ సిటీగా మారుస్తుంది
ప్రాజెక్టు ప్రత్యేకతలు
- రోడ్డు రవాణాను భగ్నపరచకుండా, రోడ్డు మధ్యలో ఎత్తుగా స్తంభాలతో రెండు లైన్లలో రవాణా జరపబడుతుంది.
- ఈ రైలు అత్యధికంగా గంటకు 80కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సుమారుగా గంటకు 34 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ప్రతిపాదించారు – MRT వ్యవస్థలకు అంతర్జాతీయ ప్రమాణం.
- ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నిర్మిస్తున్న మెట్రొ రైలు ప్రాజెక్టులలో ప్రపంచంలోనె అతి పెద్దది.
- అత్యాధునిక సిగ్నలింగ్ వ్వవస్థతో భారత దేశములో మొదటిసారిగా కమ్యూనికేషన్ అధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం.
- భద్రత కొరకు కోచ్ లలో వీడియో కెమారలు, స్టేషను లలో సి.సి.టి.వి.లు ఏర్పాటు.
- తమంతట తామె తెరుచుకునే తలుపులతోకూడిన సౌకర్యవంతమైన ఎయిర్ కండిషన్ బోగీలు.
- ఒక గంటకు ఒక దిశలో సుమారు 50,000 ప్రయాణికులు ప్రయాణించ వచ్చు.
- రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు. ఎంతగానీ కలిసి వచ్చే ప్రయాణ కాలము.
- రద్దీ సమయాలలో రెండు నుండి ఐదు నిముషాలలి ఒక రైలు.
- అత్యంత సరసమైన టికెట్ ధర. 8 రూపాయల నుండి 19 రూపాయల వరకు .
- ప్రతి స్టేషను జంక్షనుకు బస్సుల ఏర్పాట్లు.
- మూడు కారిడార్లు:
కారిడార్ | దూరం | స్టేషన్లు | ప్రయాణ సమయం |
---|---|---|---|
ఎల్.బి.నగర్ నుండి మియాపూరు | 29 కి.మీ. | 27 | 45 ని. |
జె.బి.ఎస్ నుండి ఫలక్ నుమా | 15 కి.మీ. | 16 | 22 ని. |
నాగోలు నుండి శిల్పారామం | 28 కి.మీ. | 23 | 30 ని. |