హైదరాబాద్ నగరంలోని బషీర్‌బాగ్‌లో ఆదివారం భారీ దోపిడి జరిగింది. కమిషనర్ కార్యాలయం వెనుకవైపు ఉన్న స్కైలైన్ రోడ్డులో ఇవాళ సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ముగ్గురు వ్యాపారులు వ్యాపారం నిమిత్తం నగరానికి వచ్చారు. వారు నగదు సంచులతో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి …ఆ బ్యాగులతో క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యారు.
తమవద్ద ఉన్న రూ. 1.26 కోట్ల నగదు చోరీకి గురైందని బాధితులు సంకేత్, స్వప్నిల్, సంగప్పలు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజి సాయంతో దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.