ఈ రోజు సోమవారం తేదీ 13-08-2018 నాడు సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట పట్టణంలో హరితహార కార్యక్రమాన్ని విద్యార్థిని విద్యార్థులు యువకులు సంఘ సంస్కర్తలు మరియు వివిధ కళాశాలల యాజమాన్యం పాలు పంచుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని కుతూహలంతో, ఉత్సాహంతో, పట్టుదలతో ,కృషితో ఒక కన్నుల, విన్ను ల పండుగలా జరుపుకున్నారు .
ఈ కార్యక్రమంలో తెలంగాణ బి.సి.దళ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కోవూరి. సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో భూమి యొక్క ఉపరితలం పైన ప్రతి ఒక్క జీవి మనుగడ ప్రకృతిపైనే ఆధారపడి ఉందని అలాంటి ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ప్రతి యొక్క పౌరుడిది. మన భారతదేశంలో రోజు రోజుకు కాలానుగుణంగా మనం కాలానికి విరుద్ధంగా ఎప్పుడైతే జీవిస్తున్నమొ మనిషి యొక్క మనుగడ కూడా రోజురోజుకు వివిధ రకాల జబ్బులతో, రోగాలతో బ్రతక వలసి వస్తుంది.కావున మన దేశ ప్రధాన మంత్రి గారు చెప్పినట్లు మనం ఎప్పుడైతే వర్షాకాలాన్ని సద్వినియోగ పరచుకుంటు మొక్కలు నాటే కార్యక్రమం చెపడతామొ అప్పుడే మన దేశంలో గల అన్ని రాష్ట్రాలలో పచ్చదనం క్రమక్రమంగా పెరిగి ప్రకృతిని సమకూరుస్తుంది .దీనివల్ల సమస్త జీవకోటి ప్రాణులు ఆయుర్ ఆరోగ్యాలతో
జీవిస్తాయి. చెట్లు నాటడం మన బాధ్యత చెట్లను రక్షించడం మన బాధ్యత ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యతగా ఎప్పుడైతే ప్రతి ఒక్కరు ఆచరణలొొ పెడుతూ పాటిస్తారొో అప్పుడే అన్ని కాలాలు సరి సమానం లో ఉంటాయి .కావున మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లను నాటడం వల్ల భావి తరాలకు భవిష్యత్తు బాటను వేసిన వాళ్ళము అవుతామని అందరి సమక్షంలో తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పద్మనాభ డిగ్రీ కాలేజీ ,గ్లోబల్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అనిల్ గారు ,విజ్డమ్ డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ వై పరమాత్మ గారు ,సరస్వతి శిశుమందిర్ హైస్కూల్ డైరెక్టర్ భగ్వాన్ గారు ,గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ కో కన్వీనర్ యస్.రాధాకృష్ణ , తెలంగాణ బీసీ దళ్ జిల్లా ఉపాధ్యక్షులు జి.శంకర్ గౌడ్ ,తెలంగాణ బీ.సీ దళ్ మండల అధ్యక్షులు ఎర్ర.వీరేందర్ గౌడ్, సదాశివపేట శ్రీరామ సేనా యూత్ అసోసియేషన్ నాయకులు జి.చందు గౌడ్ , రాకేష్ గౌడ్ , అ౦బదాసు , శ్రీనివాస్ గౌడ్,స్థాయి ,అఖిల్ ,మోహన్ ,కిషోర్ మరియు సదాశివపేట పట్టణ ప్రజలు