పూలే అలా ఆలోచించకుండా ఉండి ఉంటే మన సమాజం ఎంత దారుణంగా ఉండేదో: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
మహాత్మా జ్యోతిబా ఫూలే 197 జయంతిని ఖైరతాబాద్ లోని వినాయక మండపం దగ్గర ప్రతిష్టాత్మకంగా పూలే వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ
కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి , ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ పూలే ఆలోచనలు, ఆయన తీసుకున్న చర్యల కారణంగానే మన సమాజంలో ఇంత మార్పు వచ్చిందని అన్నారు. ఆయన కానీ ముందుచూపుతో ఆలోచించకుండా ఉండి ఉంటే మహిళలు కేవలం ఇళ్లకే పరిమితమై, బహుజనులు ఎన్నో వివక్ష ఎదుర్కొంటూ ఉండేవాడు.
1890 ఏప్రిల్ 11న జన్మించిన మహనీయుడు జ్యోతిబా పూలే. సత్యశోధక్ సమాజ్, బాలహత్య ప్రతిబంధక్ గ్రుహాలయం, సేవాసదనం వంటి గొప్ప సంస్థల్ని నెలకొల్పి వాటి ద్వారా బహుజనుల, వెనుకబడిన వర్గాల సమానత్వం కోసం కృషి చేసారు. ఆయనను మనం ఈరోజు స్మరించుకుంటూ ఉన్నాం.. ఆయన ఆశయ సాధనకై కృషి చేద్దాం.
సమాజంలో ఉన్న కుల, మత, ఆర్ధిక అసమానాలతను తొలగించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అన్నారు . బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడు, సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు మహాత్మ జ్యోతిరావు పూలే. తన సతీమణి సావిత్రీబాయి పూలేని చదివించడంతో పాటు ఆమెనే ఉపాద్యాయురాలిగా 1848లోనే తొలి బాలికా పాఠశాలను నెలకొల్పారంటే ఆయన విజన్ ఎంత గొప్పదో మనం గుర్తుంచుకోవాలని అన్నారు దుండ్ర కుమారస్వామి. 1840లో 9 ఏళ్ల సావిత్రీబాయి వివాహం 13 ఏళ్ల జ్యోతిబాతో జరిగింది. స్త్రీలకు విద్య చాలా అవసరం అని గ్రహించి ముందు తన భార్య సావిత్రీబాయికి చదువు నేర్పించారు జ్యోతిబా. భారతదేశ చరిత్రలోనే స్త్రీ విద్యను మొట్ట మొదట ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి జ్యోతిబాపూలే. తన పొలం దగ్గర మామిడి చెట్టు నీడలో మొట్ట మొదటి పాఠశాల పెట్టాడు. మార్పు అన్నది తన ఇంటి నుండే మొదలవ్వాలని చూపించిన గొప్ప వ్యక్తి పూలే.
బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ
కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా అని అన్నారు . బానిసత్వానికి వ్యతిరేక బావుటగా నిలిచే విధంగా ‘గులాంగిరి/బానిసత్వం’ అనే గ్రంథాన్ని మరాఠ భాషలో రచించారు. ఆ గ్రంథాన్ని అన్ని భాషల్లోకి అనువదించి, వెనుకబడ్డ ప్రతి ఒక్కరిలో ఆలోచన అనే అగ్నిని రగిల్చాడు. అయితే ఆయన సూచించిన పనులను మనం చేస్తున్నామా..? ఆయన నడిచిన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఉన్నామా..? కొందరు కారణంగా ఇంకా సమాజంలో బడుగు బలహీన వర్గాలు అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నాయి.. వాటన్నిటినీ రూపుమాపడానికి మనం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బిసీ నాయకులు పాల్గొన్నారు