అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్, జనప్రియ నగర్, రామారావు నగర్, గణేష్ నగర్, న్యూ రామారావు నగర్, లలో ఈరోజు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ జిహెచ్ఎంసి అధికారులు SRP సురేష్, SFA లు, మరియు టీఆర్ఎస్ నాయకులు కలిసి ఇంటింటికి తిరుగుతూ జాతీయ పతాకం పంపిణీ చేసారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ట్ ఎందరో మహానుభావుల త్యాగఫలం స్వతంత్ర భారతం అని, స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవడం మన విధి అని అన్నారు. సిఎం , మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు స్వతంత్ర భారతానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల ఆగస్టు 15న ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేసి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, సంక్షేమ సంఘం అధ్యక్షులు జాహేద్ షరీఫ్ బాబా, కొండం శ్రీనివాస్ రెడ్డి, రామ్ రెడ్డి, శ్రీధర్, బద్రి నాయక్, విష్ణు, శ్రీనివాస్ యాదవ్, యోగి, మహేందర్ రెడ్డి, యాదగిరి, రాంబాబు, ఆదిరెడ్డి, జనార్ధన్, రాజు, రాములు, అశోక్, సతీష్, రేవతి, సత్యవేణి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more