పవిత్ర మాసం రంజాన్.. ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. బంజారా హిల్స్ డివిజన్ లో ఉన్న ఆర్బీఎల్ బ్యాంక్ అధికారులు పవిత్ర రంజాన్ మాసంలో భాగంగా బుధవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పాల్గొన్నారు.
దుండ్ర కుమారస్వామి ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విందులో ముస్లిం సోదరులకు దుండ్ర కుమారస్వామి స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమోహన్ మాట్లాడుతూ ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల రంజాన్ నెల, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. వేసవిలో ఉపవాసం ఉండడం అంటే చాలా గొప్ప.. ఉపవాసం చేయడానికి అల్లా వీరందరికీ శక్తిని ఇచ్చారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఈ మాసంలో అవతరించింది. రంజాన్ నెలలో మంచి పనులు, దానాలతో ఎంతో పుణ్యం సంపాదించుకుంటారు. ఇక రంజాన్ పండుగను ముస్లింలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్.బి.ఎల్. బ్యాంక్ సిబ్బంది, రేఖ రావు,అనిత తదితరులు పాల్గొన్నారు.