హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్వహించనున్న ప్లాట్ల
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్వహించనున్న ప్లాట్ల విక్రయానికి సంబంధించిన ఈ-వేలం రిజిస్ర్టేషన్ ఫీజును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీని కోరామని కమిషనర్ టి.చిరంజీవులు తెలిపారు. దశాబ్ద కాలం తర్వాత చేపట్టిన నివాస స్థలాల (ప్లాట్లు) కొనుగోలులో చాలా మంది పాల్గొనేందుకు వీలుగా ప్రస్తుత నిర్ధారిత రిజిస్ర్టేషన్ రుసుమును రూ.10వేల నుంచి వెయ్యి రూపాయలకు తగ్గించాలని కోరామన్నారు. ఈ-టెండర్, ఈ-వేలంలో ప్రక్రియలో పాల్గొనే వారికి అవసరమైన సహాయం అందించేందుకు తార్నాకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం డిప్యూటీ ఎస్టేట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఫోన్ నం: 9130031489, ఏఓ ఎ.వెంకటలక్ష్మీ 9989336927 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు తెలిపారు.