హెచ్‌ఎండీఏ ఈ -వేలం పొడిగింపు
ప్లాట్ల కొనుగోలుదారుల విజ్ఞప్తి మేరకు ఈ -వేలం ప్రక్రియ (ఆన్‌లైన్ వేలం)లో మరింత మందికి అవకాశం కల్పించేందుకుగానూ రిజిస్ట్రేషన్, ఈఎండీ చెల్లింపుల గడువును పొడిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు ఒక ప్రకటనలో తెలిపారు. రిజిస్ట్రేషన్‌తోపాటు ఈ-వేలంలో తమకు నచ్చిన ప్లాట్‌ను వేలంలో కొనుగోలు చేయడానికి చెల్లించే 10% ఈఎండీల గడువు, ఈ వేలం ప్రక్రియను ఒక్క రోజు అదనంగా అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ గడువు నేటి (గురువారం) వరకు ఈఎండీల చెల్లింపుల కోసం 20వ తేదీ వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ -వేలం ప్రక్రియను ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నామని, మరిన్ని వివరాలకు హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్ WWW.HMDA.GOV.INలో కానీ ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌లు WWW.MSTCINDIA.CO.IN, WWW.MSTCECOMMERCEM STCECOMMERCE.COM ను సందర్శించవచ్చని పేర్కొన్నారు.