కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చే నెల 15న హైదరాబాద్ రానున్నారు. అదే రోజు నగరంలో అమిత్ షా సీఏఏకు అనుకూలంగా సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం
ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. అమిత్ షా
సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సీఏఏను టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్.. సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసింది. అలాగే సీఏఏకు వ్యతిరేకంగా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే 10లక్షల మందితో సభ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.