హీరో విశాల్ లాఠీ సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తు చేయి ఫ్రాక్చర్ అయింది. విశాల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న ఈ మూవీలో సునయన హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. హైదరాబద్ లో ఈ షూటింగ్ జరుపుతున్నారు. ఒక చిన్నారిని విలన్ నుంచి కాపాడే సీన్ అది. ఒక బిల్డింగ్ నుంచి క్రిందకు దూకుతూ కాపాడే సన్నివేషం లో ఈ ప్రమాదం జరిగింది. తన చేతికి, నుదుటికి గాయాల కారణంగా షూటింగ్ వాయిదా వేశారని తన ట్విట్టర్ ఖాతాలో వ్రాసుకొచ్చాడు విశాల్.
ఇప్పుడు తను కేరళలో చికిత్స తిసుకుంటున్నట్లు తెలిపారు. వినోద్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రానా ప్రొడక్షన్స్ ద్వారా రమణ, నంద కలిసి సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు. మార్చి మొదటివారంలో మళ్ళీ తుది షెడ్యూల్‌లో పాల్గొంటానని తెలిపాడు