కె.పి.హెచ్.బి. లోని శివపార్వతి థియేటర్ లో అగ్ని ప్రమాదానికి సంబందించి నాని ఈ వ్యాఖ్యలు చేసాడు.
ఎన్నో సంవత్సరాలు గా ఈ థియేటర్ మంచి పేరుగాంచింది. మంచి క్వాలిటీ సౌండ్ సిస్టం తో పెద్ద స్క్రీన్ కల్గి ఉన్న థియేటర్ ఇది. తనకు ఎన్నో సంవత్సరాలుగా ఈ థియేటర్ తో మంచి అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నాడు.
శివపార్వతి థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్నిప్రమాదం జరిగింది. ఆక్కడ ఉన్న పెద్ద స్క్రీన్ తో పాటు ఫర్నీచర్ కూడా చాలావరకు ధ్వంసం అయింది.
నాని తాను ఆ థియేటర్ లో టక్కరిదొంగ సినిమా చూసానని, అప్పట్లో ఫ్రెండ్స్ తో వెళ్ళి చాలా రచ్చ చేసానని గత జ్ఞాపకాలని ట్విట్టర్ లో నెమరు వేసుకున్నాడు. అద్రుష్టవశాత్తు ఎవరికీ ఏ ప్రమాదం జరుగక పోవడం మంచి విషయం అని పేర్కొన్నాడు.
Sad to hear about the fire accident at Shiva Parvathi theatre. I remember watching Takkari Donga there on the first day in mad euphoria. Glad to know that no one is hurt.
— Nani (@NameisNani) January 3, 2022