పీజీ, పీహెచ్‌డీ విభాగాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నూతన కోర్సులను ప్రవేశపెట్టబోతోంది. పీజీ విభాగంలో అప్లైడ్ జియాలజీ, సాంస్ర్కిట్ స్టడీస్, మైక్రో ఎలకా్ట్రనిక్స్, వీఎల్‌ఎ్‌సఐ డిజైన్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. పీహెచ్‌డీ విభాగంలో ఎలకా్ట్రనిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిస్టమ్స్ అండ్ కంప్యూటేషనల్ బయోలజీలో పరిశోధనలకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే యానిమల్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ కోర్సును కూడా ప్రారంభించనున్నారు. ఈ కోర్సులన్నీ 2019-20 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
నూతన కోర్సులను ప్రవేశపెట్టడంతో పీజీ విభాగంలో సీట్ల సంఖ్య 1900 నుంచి 2140కి పెరిగినట్లు చెప్పారు. ఎంటెక్‌లో నానోసైన్స్ అండ్ టెక్నాలజీ, ఎంఫిల్‌లో ఆంథ్రపాలజీ అండ్ రీజినల్ స్టడీస్, పీహెచ్‌డీ హిందీలో ఈ ఏడాది ప్రవేశాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇక వర్సిటీలోని ప్రతి విభాగంలో ఓబీసీ విద్యార్థుల్లో టాపర్‌కు మెడల్ అందించాలని నిర్ణయించారు.