కాంస్యం విజేత అరుణారెడ్డికి ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షలు
జామ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో కాంస్యం విజేత అరుణారెడ్డికి ప్రభుత్వం తరపున సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి మంత్రి పద్మారావు, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు ప్రభుత్వం నుంచి రూ. 20 లక్షల చెక్కును అరుణారెడ్డికి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అరుణారెడ్డి దేశానికే వన్నె తెచ్చిందన్నారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటిందని కొనియాడారు. రాబోయే టోర్నీలకు ఆమెకు అవసరమైన అన్ని సౌకర్యాలు కలిపిస్తామని హామి ఇచ్చారు. మరింత ప్రోత్సాహం అందేలా చూస్తామని చెప్పారు. అరుణారెడ్డి స్పందిస్తూ.. ప్రభుత్వానికి, సాట్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. నాన్నకు, కోచ్ బ్రిజ్ కిశోర్‌కు పతకం అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.