గుజరాత్ ఎన్నికల్లో బిజెపి కే పట్టం ఒపినియన్ పోల్ల్స్ లో వెల్లడి.
గుజరాత్ విధానసభలో మొత్తం 182 సీట్లు ఉన్నాయి. 2007 శాసనసభ ఎన్నికల సందర్భంగా 20 స్థానాలను షెడ్యూల్డు తెగలకు కేటాయించారు. అందులో కాంగ్రెస్ 11, భాజపా 8 గెలవగా, మిగిలిన ఒక స్థానాన్ని జేడీ (యు) కైవసం చేసుకొంది. 2008లో నియోజకవర్గాల పునర్‌విభజన జరిగాక, ఎస్టీలకు కేటాయించిన సీట్ల సంఖ్య 26కు పెరిగింది. 2012 ఎన్నికల్లో భాజపాకు 10, కాంగ్రెస్‌కు 15, జేడీ(యు)కు ఒక స్థానం దక్కాయి. ఎస్టీ సీట్ల విషయంలో తన స్థితిని మెరుగుపరచుకొనేందుకు ఈసారి భాజపా గట్టిగా ప్రయత్నిస్తోంది.