గుజరాత్‌లో కమలం పార్టీ వరుసగా ఆరోసారి జయకేతనం ఎగరవేసింది.
22 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. గుజరాత్ ఎన్నికలు మోదీ సర్కారుకు లిట్మస్ టెస్టులా మారాయి. మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి ఆర్థిక సంస్కరణలపై జనం స్పందన తెలుసుకోవడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడ్డాయి. వ్యాపారులు ఎక్కువగా ఉండే గుజరాత్‌లో కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహించింది.
“Will form Government in both Himachal and Gujarat with clear majority” says Home Minister Rajnath Singh #HimachalPradeshElections2017 #GujaratVerdict pic.twitter.com/TZymBvklV7
— ANI (@ANI) December 18, 2017
బీజేపీ 22 ఏళ్లపాటు అధికారంలో ఉండటంతో ప్రజల్లో ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత, మోదీ గుజరాత్ సీఎంగా లేకపోవడం, పాటీదార్ వర్గం మద్దతు, నోట్ల రద్దు, జీఎస్టీ, సోషల్ మీడియాలో బలమైన ప్రచారం.. ఇన్ని అనుకూలతలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వగలిగిందే కానీ.. విజయ తీరాలకు మాత్రం చేరువ కాలేక పోయింది. రాహుల్ తన శైలిని మార్చుకోని ప్రచారం చేసినా, దేవాలయాలను దర్శించినా ఉపయోగం లేకపోయింది.