ఒక వైపు కరోన విజృంభిస్తుంటే మరోవైపు కరోన కారణంగా ప్రభుత్వ విధించిన లాక్డౌన్ వలన అనేక మంది పేదలు, అనాధలు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటి వారి పట్ల తమ సామాజిక బాధ్యతగా,
తమ శక్తి మేర వారి ఆకలి తీసురుతున్నామని పాషా క్రికెట్ అసోసియేషన్, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు తెలిపారు.
గురువారం ఉప్పల్ డిపో, బొడుప్పల్, పిర్జాదిగుడా, హబ్సిగూడా, నాచారం, మల్లాపూర్ పరిధిలో రోడ్డు పైన జీవనం సాగించే వారికి, హాస్పిటల్ పని మీద వచ్చి ఆకలితో బాధ పడే వారికి పాషా క్రికెట్ అకాడమీ,ప్రెండ్స్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సుమారు 100 మందికి అన్నం ప్యాకెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాషా క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులు పాషా,ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ నిర్వాహకులు సయ్యద్, అజీమోద్దీన్, గౌస్, యాకుబ్, హమీద్ లు పాల్గొన్నారు.