శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గౌడ కుటుంబ సభ్యులను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఐకమత్యంగా ఉండేలా శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులు కృషి చేయాలని నందిగామ గ్రామంలో గౌడ హాస్టల్ కోసం రూ.5 కోట్ల విలువైన భూమిని విరాలంగా ఇచ్చిన స్థలదాత దొంతి లక్ష్మీ నారాయణ గౌడ్ అనీ అన్నారు. శుక్రవారం చందానగర్ సుప్రజ బ్యాంకెట్ హాల్లో శేరిలింగంపల్లి గౌడ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో గౌడ సేవా ప్రముఖులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంక్షేమ సంఘం సభ్యలు లక్ష్మినారాయణ గౌడ్ వెండి కిరీటంతో అదేవిధంగా గౌడ హాస్టల్ లో గదుల , వివిధ పుణ్య క్షేత్రాలలో సత్రాల గదుల నిర్మాణాలకు విరాళాలు అందజేసిన వారికి మెమోంటోలు అందజేసి, పూలమాలలు, శాలువాలు, వేద ఆశీర్వచనంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులందరు ఏకతాటి పైకి వచ్చి మన బలంను నిరూపించుకునేందుకు మెంబర్ షిప్ కు సహా కరించాలని కోరారు. విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు కోసం సంక్షేమ సంఘం కృషి చేస్తుందని అన్నారు. అలాగే 18 మంది గౌడ ప్రముఖులు గౌడ హాస్టల్ భవనం కోసం ఒక్కోరు రూ.4 లక్షల చొప్పున, యాదగిరిగుట్టలో గౌడ సత్కం కోసం రూ.1లక్ష మొదలు రూ.10 లక్షల వరకు 25 మంది విరాళాలు ప్రకటించడం పట్ల గౌడ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. విరాళాలు ఇచ్చిన దాతలు అశోక్ గౌడ్, లక్ష్మీ నారాయణ, గౌడ్, కృష్ణ గౌడ్, రాములు గౌడ్, శంకర్ గౌడ్, యాదగిరి గౌడ్, మూల వెంకటేష్ గౌడ్, రాచమల్ల వెంకటేష్ గౌడ్, బి. జగదీశ్వర్ గౌడ్, రాచమల్ల శ్రీనివాస్ గౌడ్, మద్దూరి రాధాకృష్ణ, రాచమల్ల ఓం ప్రకాష్ గౌడ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, మద్దూరి శివశంకర్ గౌడ్, నిమ్మల ధాత్రినాథ్ గౌడ్, నందికంది కరుణాకర్ గౌడ్, చెగూరి మధుర వేణి, నిమ్మల సాయికృష్ణ గౌడ్, లోతుకొమ్ముల సాయికుమార్ గౌడ్, రక్తపు రాములు గౌడ్, రక్తపు జగన్ గౌడ్, రక్తపు విఠల్ గౌడ్, రక్తపు నగేష్ గౌడ్, రాచమల్ల భాస్కర్ గౌడ్, కూన గౌరీదేవీ, వీరమల్ల ప్రశాంత్ గౌడ్, తోకలు బాలరాజ్ గౌడ్, కట్ట వెంకటేష్ గౌడ్, కొత్తపల్లి నర్సింగరావు, చిట్టి సుదర్శన్ గౌడ్, మూల అంజిబాబు గౌడ్, ఎరుకల వినోద్ గౌడ్, కుకునూర్ శ్రీనివాస్ గౌడ్, బీయ లింగంగౌడ్, దుర్గం వీరేశ్ గౌడ్, కూన సత్యం గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, సంఘం అమర్ నాథ్ గౌడ్, సంఘం జనార్దన్ గౌడ్, పెదగోని దనుంజయ్ గౌడ్, నరేంద్ర గౌడ్
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు….
సెవెన్ సీస్ అధినేత కుమారుడి పంచ కట్టు వేడుక హాజరైన ప్రముఖులు…. సెవెన్ సీస్ గేమ్ డెవలప్మెంట్ కంపెనీ అధినేత మారుతి శంకర్ కుమారుడు పంచ కట్టు...
Read more