మెట్రో ప్రాజెక్టు పనులను గవర్నర్ నర్సింహన్, మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ మెట్రో ప్రయాణంలో చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్, మున్సిపల్ సెక్రటరీ నవిన్ మిట్టల్ కూడా ఉన్నారు.
నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా మెట్రో రైలును ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు మెట్రో రైలు పనులను పరిశీలించారు. మధ్యాహ్నం ఎస్‌ఆర్ నగర్ మెట్రోస్టేషన్‌లో మెట్రో రైలెక్కి మియాపూర్ మెట్రోస్టేషన్ వరకు ప్రయాణం చేశారు. అక్కడ మెట్రో పరిసర ప్రాంతంలో జరుగుతున్న మెట్రో సుందరీకరణ పనులను పరిశీలించారు.
అంతా సిద్ధం నవంబర్ 15 నాటికి మెట్రో రైల్ ప్రారంభానికి రెడీ అవుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. నవంబర్ 28న మెట్రోరైల్‌ను ప్రారంభించాలని ప్రధాని మోడీని కోరామన్నారు. ప్రపంచ భాగస్వామ సదస్సు ప్రారంభానికి ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పారు. మెట్రో రైల్ ప్రారంభంపై ప్రధాని కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉందని కేటీఆర్ తెలిపారు.