ఇప్పటికే చాలామంది గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇందులోనే ఒక అడ్వాన్స్డ్ ఫీచర్ ని ప్రవేశ పెట్టబోతున్నారు. అదే ట్రాఫిక్ అలర్ట్. ఇప్పటివరకు గూగుల్ మ్యాప్స్ లో ట్రాఫిక్ రద్దీ గా ఉన్నప్పుడు ఎరుపు రంగు మార్గాన్ని సూచించేది. దాన్నిబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉందని వాహనదారులు గుర్తించేవారు.
దీంతో పాటు ఒక్కొక్కసారి హఠాత్తుగా జరిగే పరిణామాల వల్ల కూడా ట్రాఫిక్ జామ్ కావచ్చు. ధర్నాల వల్ల కానీ, యాక్సిడెంట్స్ వల్ల కానీ హఠాత్తుగా ట్రాఫిక్ జామ్ అయితే పాప్ అప్ రూపంలో వాహందారులని అలర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
దీని గురించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గూగుల్ తో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు ఒక తుదిరూపం దాలుస్తుందని వారు చెప్తున్నారు. న్యూయార్క్ పోలీసులు కూడా ‘511ఎన్‌వై’ అని ఒక వెబ్‌సైట్‌లో ఇలాంటి అప్డేట్సే ఇస్తుంది. దీన్ని రిఫరెన్స్ గా తీసుకుని ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.