పది గ్రాముల బంగారం ధర రూ.32,015కి చేరుకుంది
బంగారం ధర శుక్రవారం భారీగా పడిపోయింది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు రూపాయి బలపడడంతో పసిడి ధర ఏకంగా రూ. 235 తగ్గింది. ఫలితంగా స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర రూ.32,015కి చేరుకుంది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడం కూడా పసిడి ధర తగ్గుదలకు మరో కారణమని బులియన్ వర్గాలు తెలిపాయి. కాగా, గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర గురువారం ఒక్కరోజే ఏకంగా రూ.350 పెరిగి రూ.32 వేల మార్క్‌కు చేరుకుంది. మరోవైపు బంగారం ధరతోపాటు హెచ్చుతగ్గులు నమోదు చేసే వెండి ధరలో శుక్రవారం ఎటువంటి మార్పు కనిపించలేదు. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ లేకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. శుక్రవారం కేజీ వెండి ధర రూ.37,900గా నమోదైంది.