పీర్జాదిగూడ : కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఆర్ధిక బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగ, కార్మిక సిబ్బందికి ప్రకటించిన 30% పిట్ మేంట్, పీఆర్సీ జీ.ఓ.వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసీ) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముడి మార్టిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ AITUC మున్సిపల్ ఓప్పంద సిబ్బందితో కలిసి పని ప్రదేశం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ముడి మార్టిన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పిట్మేంట్ కుజీ.ఓ.విడుదలై వేత
నాలు పెరుగుతాయని కొండంత ఆశగా ఎదురు చూస్తున్న సిబ్బందికి పీఆర్సీ పిట్ మేంట్ కి జీ.ఓ. విడుదల చేసి చేయాలని, కనీస వేతనం రూ.24/-వేలు ఇవ్వాలని, సిబ్బందికి కరోనా ఇన్సెంటివ్ గత సంవత్సరం వలే ఈ సంవత్సరం ఇవ్వాలని, కరోనాతో మరణించిన వారికి 10 లక్షల ఎక్సిగ్రేషియా ఇవ్వాలని కార్పోరేషన్లో పనిచేస్తున్న సిబ్బందికి రక్షణ పరికరాలు విధిగా అందించాలని పలు డిమాండ్లతో కూడిన ప్లెకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నిక, కార్పోరేషన్లు, మున్సిపా లిటీల ఎన్నికల్లో ఓట్లు రాల్సుకోవడానికి 30% పిట్ మేంట్ తో పీఆర్సీ ప్రకటించారని ఓడ ఎక్కిందాక ఓడ మల్లయ్య ఓడదిగినంక బోడి మల్లయ్య అన్న సందంగా తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన పిట్ మేంట్, పీఆర్సీ కి నేటికీ జీ.ఓ.విడుదల చేయకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని, నిజంగా కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తసుద్ది ఉంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మిక సిబ్బందికి ప్రకటించిన పిట్ మేంట్ కు జీ.ఓ.విడుదల చేసి కెటగిరిల వారిగా వేతనాలు నిర్ణయించి చెల్లించాలన్నారు.
కరోనాతో పోరాడుతూ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న సిబ్బందికి గత ఏడాది ఇన్సెంటివ్ ఇచ్చారు ఇప్పుడెందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కరోనాతో హోంహైషోలేసన్ లో ఉన్న మున్సిపల్ సిబ్బందికి పూర్తి జీతం చెల్లించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు దానయ్య, బిక్షపతి, కె.లక్షమ్మమ్మ, ఆర్. ఎల్లమ్మ, జి.పాపమ్మ, సుజాత, సిహెచ్ శోభ. సావిత్రి,గీతా, వి లక్ష్మి. పి నరసింహ. కే కిరణ్. వి అనిత. వి లక్ష్మి . ఎం శ్రావణి తదితరులు పాల్గొన్నారు.