ప్రపంచ విపత్తుగా పరిణమించిన కరోన వ్యాధి వ్యాప్తిని అత్యధిక జనాభా మరియు పరిమిత వనరులు కల్గిన భారతదేశం అధిగమించాలంటే కటినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని అందుకొరకు భారత్ లో మార్చి 23న అర్ధరాత్రి 12 గంటల నుండి ఏప్రిల్ 14 వరకు 21 రోజులపాటు దేశమంతట లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ కొనసాగుతూ ఉంది. పరిమిత సమయం లోనే నిత్యావసర వస్తువులు అందించే కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు తెరచి ఉంచుటకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు సామాజిక దురాన్ని పాటించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ఇంటికి ఒకరు మాత్రమే బయటికి వచ్చి కావలసిన సరుకులు కొనుగోలు చేయవలసిందిగా కోరారు. కరోనా ను జయించడానికి నియంత్రణ ఒక్కటే మార్గమని సూచించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి హోమ్ కారెంటైన్ ను పాటించాలని కోరడం జరిగింది. ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ లను చేతులు శుభ్రపరచుటకు వాడాలని, వేడి నీరు తాగాలని, చికెన్, గుడ్లు తినాలని, దాని ద్వారా మనిషికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని సూచించడం జరిగింది. ఒకవేళ తప్పనిసరిగా బయటికి రావలసి వచ్చినా మనిషికీ మనిషికీ మధ్య మూడు అడుగుల దూరాన్ని పాటించాలని కోరడం జరిగింది. సరుకులు, మందులు, కూరగాయలు వంటి అత్యవసర సరుకు రవాణకు మాత్రమే అనుమతించింది ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కలసికట్టుగా సహకారం అందిస్తే కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చు అని పేర్కొన్నారు.
సాంక్రమిత వ్యాధిగా గుర్తించి జనాలు ఇల్లనుండి బయటకు రావొద్దని పదే పదే చెప్పినా రాష్ట్రంలో కొందరు నిర్లక్ష్య వైఖరిని చూపించడం, అవసరం లేకపోయినా వాహనాలు వేసుకుని బయటకి రావడంతో కొన్ని సార్లు పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేయడం, వారి వాహనాలను సీజ్ చేయడం, కేసులు పెట్టడం కుడా జరుగుతూ ఉంది. అయినప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుండడంతో సీఎం కేసీఆర్ ఒకసారి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చెయ్యవలసి వస్తుందని హెచ్చరించడం జరిగింది. ప్రజలందరికీ నిత్యవసర వస్తువులను అందిస్తామని, వేరే రాష్ట్రాల నుండి చదువు కోసం వచ్చిన వారికి ఆహారం, వసతి బాధ్యత కూడా స్వీకరిస్తామని చెప్పడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు కూలి పనికి వచ్చిన వారికి కావలసిన రేషన్ లేదా ఆహారాన్ని మరియు కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల చొప్పున ఖర్చుల కొరకు అందిస్తామని కాబట్టి వారంతా రాష్ట్రం వదిలి స్వగ్రామాలకు తరలివెళ్లె ప్రయత్నాలు చేయవద్దని, కరోనను వారి వారి ఊర్లకు చేరవెయ్యోద్దని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ ను ప్రభుత్వమే కొంటుందని, నిరాశ పడొద్దని, పంట నూర్పిడికి అవసరమైన యంత్ర పరికరాల సంసిద్ధతకు తగిన సూచనలు కుడా చేసారు. అంతేకాకుండా కేంద్రం మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు తూచా తప్పకుండ పాటిస్తూ అన్ని శాఖలతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, పరిస్తితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు.
లాక్ డౌన్ తో ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంటూ తమ కుటుంభ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కొన్ని ఐటి సంస్థల ఉద్యోగులు ఇళ్ళ నుండే పని చేస్తున్నారు. అత్యవసర విభాగంలో పనిచేసే ఉద్యోగులు అందరు వారి విధుల్లో నిభద్దులై పనిచేస్తున్నారు. ఇక సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకూ అందరూ ఇంటికే పరిమితం అయిపోయారు. వెనుకటి కాలంలో పెళ్ళికి, పేరంటానికి, పండక్కి, పబ్బానికి కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట చేరే వారు. ఆనందంగా గడిపేవారు. వైరస్ ప్రభావం వల్ల అదే పరిస్థితి ఇప్పుడు తిరిగి వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొంత సమయం వరికైనా పాత రోజులు తిరిగి వచ్చాయని చెప్పవచ్చు. పాతకాలంలో ఉపయోగించిన గృహ చిట్కాలు, ఆరోగ్య సూత్రాలు ఇప్పుడు పాటించడం జరుగుతుంది. ఇందులో పసుపు, ఉప్పు, అల్లం, మిరియాలు మరియు వేడి నీటిని ముఖ్యమైన పదార్థాలుగా చెప్పవచ్చు.
కరోనా వైరస్ నియంత్రణ గురించి నిపుణులు చెప్తున్న సూచనలు తప్పకుండ పాటించాలి. బయటికి వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం లేదా కర్చీఫ్ ను అయిన సరే కట్టుకోవాలి. తరచు వేడి నీటిని తాగుతూ ఉండాలి. అల్లం, పసుపు, మిరియాలు మన ఆహారంలో భాగం చేసుకోవాలి. తరచు చేతులను 21 సెకండ్ల పాటు సబ్బుతో శుభ్రపరచుకోవాలి. సానిటైజర్లు వాడాలి. ఇంటిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరి మధ్య ఒక మీటరు దూరం ఉండేట్టు చూసుకోవాలి. విదేశీ ప్రయాణం చేసినవారు ప్రతి ఒక్కరు స్వచ్చందంగా హోమ్ కారెంటైన్ ను పాటించాలి. ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలకు సేవలు చేస్తున్న వైద్య సిబ్బందికి, పారిశ్యుద్ధ కార్మికులకు, పోలీసు, పారామిలటరీ బలగాలకు, అత్యవసర సహాయక బృందాలకు సహకరించాలి. ప్రజలు కుడా కరోన వ్యాధి లక్షణాలతో కనిపించిన వారికి దూరంగా ఉండాలి. విదేశీయులు తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్టు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ఎన్.ఆర్.ఐ.లు హోం-క్వారంటైన్ పాటించకుండా బయట తిరుగుతున్నట్టయితే అట్టి సమాచారాన్ని కుడా పోలిసుల దృష్టికి తీసుకురావాలి. కరోనకు నియంత్రణ ఒక్కటే మార్గమని నిర్లక్ష్యం చేస్తే ఇది మహమ్మారిగా మారే అవకాశం ఉందని అందుకు చైనా, యురోపియన్ దేశాలైన ఇటలీ, స్పెయిన్, జర్మనీ మరియు అమెరికా, ఇరాన్ వంటి దేశాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసులు మరియు మరణాల సంఖ్యే నిదర్శనం అని కావునా ప్రజలందరూ స్వీయనియంత్రణతో ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని, కరోన పై విజయం సాధించడంలో భాగస్వాములు అవ్వాలని బి.సి.దళ్ వ్యవస్థాపకులు దుండ్ర కుమారస్వామి ప్రజలను అభ్యర్దిస్తున్నారు.