పరీక్షలు బాగా రాయలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగింది. సీఐ వడ్డె ప్రసన్నకుమార్, స్థానికులు తెలిపిన ప్రకారం.. కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లోని స్వరూప్, కవితల కుమార్తె ప్రియాంక(18) నగరంలోని షేక్‌పేటలోని నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ ప్రథమ సంవత్సరం చదువుతోంది.
తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఇంట్లోనే ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ప్రియాంక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు ఆమె రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరీక్షలో ఫెయిలవ్వడం తనను బాధించిందని, తన చదువుకు తల్లిదండ్రులు ఏటా రూ. 11 లక్షలు ఖర్చు చేస్తున్నారని లేఖలో ఆమె పేర్కొంది. ఎస్సై పి.అనిల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.