రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని సాయి నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ లో భాగంగా డ్రైనేజీ పనులు తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ కాంట్రాక్టర్లు మరియు దీనిని పర్యవేక్షణ చేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు ఏఈ ప్రశాంత్ కుమార్ పనులు జరుగుతున్న ప్రదేశంలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు గాని మార్కింగ్ లు కాని చెయ్యలేదు మరియు ఏ ఇతర ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన , ఇప్పటికి ముగ్గురు వ్యక్తులు ఆ గోతుల్లో పడడం చిన్న చిన్న ప్రమాదాలకు గురవుతున్నారు.
నిన్న ఉదయం కృష్ణవేణి అనే ఒక నిరుపేద మహిళ డ్రైనేజి కోసం తవ్విన గుంటలో పడడంతో చేతికి గాయం అయ్యింది అందుకు వైద్యానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న ఆ మహిళకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు కాంట్రాక్టర్ లేదా ఆ పనులు పర్యవేక్షిస్తున్న సంబందిత అధికారులే బాధ్యత వహించవలసి ఉంటది. సదరు బాదితురాలికి వైద్యానికి ఖర్చులు బరించాల్సిన కాంట్రాక్టరు లేదా అధికారులు తమకు ఆ ప్రమాదాలతో సంబంధం లేదని చెప్పడం గమనార్హం. ఈ ప్రమాదాలపై వివరణ కోరిన తొలిపలుకు పత్రికకు సమాధానం ఇస్తూ తాము తగిన చర్యలు తీసుకుంటామని, బాదిత మహిళకు న్యాయం చేస్తామని తెలిపాడు.
అంతే కాకుండా మీడియా దృష్టికి విషయం చిక్కడంతో ఆ ప్రదేశంలో మొక్కు బడిగా ఒక టేప్ కట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పటికైనా , కాలువ పనులు పర్యవేక్షణ చేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు తగిన హెచ్చరిక బోర్డులు మరియు రేడియం టేప్ తో బోర్డర్స్ ఏర్పాటు చెయ్యాలి మరియు కాలనీతో అనుసంధానం అవుతున్న కూడళ్ళలో ముందే హెచ్చరిక బోర్డులు మరియు రేడియం టేప్ తో పని ప్రదేశం వద్ద బోర్డర్ ఏర్పాటు చేసి పాదచారులకు, వాహన దారులకు అవగాహన వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలి.
పబ్లిక్ ప్రదేశాల్లో పనులు చేసే కాంట్రాక్టరులు మరియు అధికారులు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్య EE చెన్నారెడ్డి దృష్టికి వెళ్లిన వెంటనే, స్పందించి DE రూప బాధితురాలి తో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.