ఘట్ కేసర్: తెలంగాణ రాష్ట్ర, మేడ్చల్ జిల్లా, ఘట్ కేసర్ మండలం, సత్య సాయి హౌసింగ్ కాలనీలో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ బోర్ల నిర్మాణాలు చేపడుతున్నారని, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో వెంటనే స్పందించి, ఆర్ఐ సంకీర్త్, అక్కడికి చేరుకొని అక్రమ బోర్ల నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలు తప్పవని స్థానికులకు భరోసా ఇచ్చి, అక్రమంగా బోర్ వెయ్యడాన్ని నిలిపివేశారు. ఈ సందర్భంగా సంకీర్త్ మాట్లాడుతూ…
ఘట్ కేసర్ మండల్లో అనుమతులు లేకుండా రాత్రి, పగలు తేడా లేకుండా ఇష్టానుసారంగా అక్రమంగా బోర్లు వేస్తున్నారని, వ్యవసాయానికి మాత్రమే అనుమతులు ఉన్నా, ఆరున్నర అంగుళాల బోర్లను నివాస స్థలాల్లో ఇష్టానుసారంగా వేసుకోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, దళారులకు బోర్ల దందా కనకవర్షం కురిపిస్తుందని, అనుమతులు లేకుండా అక్రమంగా బోర్ వేస్తే ఉపేక్షించే పరిస్థితి లేనే లేదని ఆర్ ఐ సంకిర్త్ హెచ్చరించారు.
వెంటనే స్పందించి చర్యలు చేపట్టిన ఘట్ కేసర్ మండల ఎమ్మార్వో మరియు ఆర్ ఐ సంకిర్త్ పట్ల స్థానిక కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ, కృతజ్ఞతలు తెలిపారు.