నిషేదిత మత్తు పదార్థం హేరైన్ (డ్రగ్స్ ) సరఫరా చేస్తున్న వ్యక్తిని శేరిలింగం పల్లి ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అతని వద్ద నుంచి 48 గ్రాముల హేరైన్ ను స్వాధినం చేసుకొన్నట్లు శేరి లింగంపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ తెలిపారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మల్దా ప్రాంతానికి చెందిన సింతులాల (38) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. కాగా సులభంగా డబ్బులు సంపాదించాలని ఆలోచనతో అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇదే క్రమంలో గుట్టు చప్పుడు కాకుండా హెరైయిన్ ( మత్తు పదార్థం ) తీసుకొచ్చి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. శుక్రవారం విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు ఆఫీజ్ పేట్ మై హోమ్ మంగళ అపార్ట్మెంట్స్ సమీపంలో హెరాయిన్ ను తీసుకెళ్తుండగా సింతులాలను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. శంషాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్ సత్యనారాయణ ఆదేశాల మేరకు డిటిఎఫ్ వై. వెంకటరెడ్డి, ఇతర సిబ్బంది శ్రీకాంత్ రెడ్డి, యాదయ్య,మల్లేష్, ఫకృద్దీన్ లు పాల్గొన్నారు.
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more