శనివారం రాత్రి కురిసిన వర్షానికి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ పి జె ఆర్ నగర్ లో ని నివాసాలు వర్షంతో పూర్తిగా నిండా మునిగిపోయి ఇండ్ల వద్దకు నీళ్లు చేరాయి.. విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి ఇంచార్జి, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గజ్జల యోగానంద్ ఘటనా స్థలాలకు చేరుకొని నాలాల పరిస్థితిని పర్యవేక్షించి, నాళాల్లో పేరుకుపోయిన చెత్తను, వ్యర్ధాలను కార్యకర్తలతో కలిసి తొలగించి, ప్రభుత్వఆధికారులను ఆదేశించి నాళాలను శుభ్రం చేయించారు.బ్లాక్ నెంబర్ 53 54 లో ఉన్న ఇండ్లను పరిశీలించారు. వాన నీరు చేరి ఇంట్లో ఉన్న పరికరాలు పాడైపోయాయని కాలనీవాసులు తమ ఇండ్లను చూపించారు.. గజ్జల యోగానంద్ మాట్లాడుతూ ఏండ్ల కొద్ది ఈ సమస్య వెంటాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ లైన్లు సరిగ్గా వేయకపోవడం అవుట్ లైన్ ల నిర్మాణం సరిగా లేకపోవడంతో ఈ సమస్యలకు తావిస్తుందని, ఇప్పటికైనా సమస్యలు పునరావృత్తం కాకుండా కోరారు.. ఈ కార్యక్రమంలో మని భూషణ్, టపా రఘు, విజిత్, కమలాకర్ రామచంద్రుడు, మధుసూదన్,కుమార్, స్వప్న, అనిత, సునీత మరియు కార్యకర్తలు ప్రజలు తదితరులు
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో...
Read more