అద్భుత ఫామ్‌తో అదరగొడుతోన్న తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ విజేతగా నిలిచాడు. సూపర్ సిరీస్ టైటిల్స్ విజయాల్లో హ్యాట్రిక్ కొట్టిన కిదాంబి.. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి ఈ సీజన్‌లో నాలుగో టైటిల్ సాధించాడు. ఆదివారం జరిగిన తుది పోరులో 21-14, 21-13తో జపాన్ ఆటగాడు కెంటా నిషియోటాపై అలవోక విజయం సాధించాడు. తొలి గేమ్‌ను 21-14తో గెలుచుకున్న శ్రీకాంత్ రెండో గేమ్‌లోనూ అదే జోరు కొనసాగించి 21- 13 గెలుపొందాడు.
దీంతో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. కెంటా నిషియోటా ఏ దశలోనూ శ్రీకాంత్‌కి పోటీ ఇవ్వలేకపోయాడు. ఈ టైటిల్ నెగ్గడం ద్వారా ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచిన నాలుగో పురుష షట్లర్‌గా కిడాంబి శ్రీకాంత్ రికార్డు నెలకొల్పాడు. ఈ తెలుగు తేజం వారం క్రితమే డెన్మార్క్ ఓపెన్ గెలుపొందిన సంగతి తెలిసిందే.