బొడుప్పల్: బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్, 7వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కాటపెల్లి లతా రామచంద్రా రెడ్డి గారు, డివిజన్ పరిధిలోని కాలనిలలో సూపర్ స్ప్రెడర్స్ హై రిస్క్ వెండర్స్, కిరాణా షాప్ మరియు ఇతర వ్యాపారులకు, అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని, 7 వ డివిజన్ HUDA లక్ష్మీ నగర్ మెయిన్ రోడ్ షాపుల వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ వార్డ్ సభ్యులు కాటపెల్లి రామచంద్రా రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు సత్యం రెడ్డి, HUDA అధ్యక్ష కార్యదర్శులు, అమర్ లింగారెడ్డి, రాజా గౌడ్, సాదా రవీందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, అంజనేయనగర్ కాలనీ ఇన్ ఛార్జ్ P.C రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాక్సిన్ రిజిస్ట్రేషన్ కొరకు 9505715541 నెంబర్ ను సంప్రదించగలరు అని తెలియజేశారు..
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి-ముహమ్మద్ అజహరుద్దీన్
క్రీడాకారుల విజయాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయి క్రీడలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యన అనుబంధాన్ని పెంపొందించడానికి ఉపయోగపడతాయని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. మంగళవారం నాడు...
Read more