మే లో ఉచిత కంటి పరీక్షలు
పేదలకు ఉచిత వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా మే నెలలో 40 లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హస్తినాపురం డివిజన్‌లోని నందనవనం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎంపీ మల్లారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పద్మానాయక్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందనవనం కాలనీలో ముందుగా ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించి, సంవత్సరంలోగా 30 పడకల ఆస్పత్రిగా మారుస్తామని హామీనిచ్చారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి బస్తీ దవాఖానలను ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామని, ఇప్పటికే 40 దవాఖానలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో బాలాజీపవార్, ఉప కమిషనర్ విజయకృష్ణ, ఏఎంహెచ్‌వో మల్లికార్జున్, వాటర్ వర్క్క్స్ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ పుట్టం పురుషోత్తంరావు, టీఆర్‌ఎస్ ఎల్‌బీనగర్ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, సునీతారెడ్డి, రఘుమారెడ్డి, రాజుగౌడ్, విష్ణు, రవీందర్‌రెడ్డి, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.