విషయంలోకి వెళితే ఫౌంటెన్ హెడ్ విద్యా సంస్థ – నర్సరీ ,ప్రాథమిక విద్యా నుండి ఇంటర్ విద్యా వరకు 12 సంవత్సరాల కృషితో తపన, పట్టుదల, ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో అవార్డులు రివార్డ్ లు మేఘనా ముసునూరి తన సొంతం చేసుకుంది. ప్రపంచ దేశాలలో విద్యా రంగంలో అత్యుత్తమ అవార్డు గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డు ను ఒక ప్రముఖ సంస్థ ఆర్కె ఫౌండేషన్ ద్వారా పొందినారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దల్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి శాలువాతో తో సన్మానం చేయడం జరిగింది. ఆ తదుపరి మేఘన ముసునూరి ఫౌంటైన్ హెడ్ గ్లోబల్ స్కూల్ మరియు కాలేజ్ యొక్క జ్ఞాపికను కుమారస్వామికి అందజేయడం జరిగింది. దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం దానికి నిలువెత్తు నిదర్శనం మేఘనా ముసునూరి అని తెలియజేశారు.
తన సొంత డబ్బులతో బడుగు బలహీన వర్గాలకు,నిరుపేదలకు ప్రతి సంవత్సరం ఉచితంగా విద్యను కూడా అందించడం ఒక గొప్ప విశేషమని తెలియజేశారు.అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ, మహిళా సాధికారతకు నిరంతరం కృషి చేస్తు, ఫౌంటెన్ హెడ్ విద్యా సంస్థ ద్వారా వినూత్న ప్రయోగం చేస్తూ భావి తరాల పిల్లలకు విజ్ఞానాన్ని ఆధునిక పద్ధతులలో అందిస్తూ, పిల్లల ఉజ్వలమైన భవిష్యత్తును తీర్చిదిద్దుతూ గురువుగా తన బాధ్యతలు నిర్వహిస్తుంది.