• సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
Tholi Paluku News
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
        • వ్యాపారం
          • రియల్ ఎస్టే
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు
No Result
View All Result
Tholi Paluku News
No Result
View All Result
Home News

కులాల అతీతంగా బీసీల ధర్మపోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి

AdminbyAdmin
26/01/2025
inNews
0
కులాల అతీతంగా బీసీల ధర్మపోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి

కులాల అతీతంగా బీసీల ధర్మ పోరాటానికి మద్దతు ప్రకటించిన మాజీ అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి

కేంద్ర ఓబిసి కులాల జాబితాను వెంటనే వర్గీకరించి, అమలులోకి తెండి – డా|| వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు

కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయండి- జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

త్వరలో చేపట్టే కులగణనలో బిసిల గణనను చేపట్టండి

నాన్‌క్రిమిలేయర్‌ ఆదాయ పరిమితిని 8 లక్షల నుండి 15 లక్షలకు పెంచాలి.

డిమాండ్ల సాధనకు జాతీయ ఉద్యమ నిర్మాణానికి త్వరలో కార్యాచరణ – జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

    జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ నివేదిక మేరకు కేంద్ర ఓబిసి కులాల జాబితాను కులాలవారీగా వర్గీకరించాలని, కులగణనలో బిసి జనాభా గణనను చేపట్టాలని, బిసిలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జాతీయ బిసి దళ్‌ ఆధ్వర్యంలో జరిగిన మేధావుల సామాజిక వేత్తల, కులసంఘాల, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధుల రౌండ్‌టేబుల్‌ సమావేశం కేంద్ర ప్రభుత్వంను ఏకగ్రీవంగా డిమాండ్‌ చేసింది. చిరకాలంగా ఈ డిమాండ్ల సాధనకు బిసిలు వివిధ రూపాలలో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం పెడచెవిన పెట్టడం పట్ల సమావేశంలో వక్తలు నిరసన వ్యక్తం చేశారు.
    శనివారం నాడు జాతీయ బిసి దళ్‌ అధ్యకక్షుడు దుండ్ర కుమారస్వామి అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న రాష్ట్ర బిసి కమిషన్‌ మాజీ ఛైర్మన్‌, డా|| వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, మాజీ చైర్మన్ అధికార భాషా సంఘం కీలక ఉపన్యాసం చేశారు.

డా|| వకుళాభరణం ప్రసంగిస్తూ …

కేంద్ర ఓబిసి కులాల జాబితాను గ్రూపులుగా వర్గీకరించి రిజర్వేషన్‌లను అమలు చేయాలని జస్టిస్‌ రోహిణీ కమిషన్‌ జూలై 31, 2023 లో నివేదిక సమర్పించినప్పటికీ కేంద్రప్రభుత్వం ఇప్పటి వరకు అమలులోకి తీసుకురాకపోవడం పట్ల ఆయన తీవ్ర విచారంను వ్యక్తంచేశారు. దేశంలోని 3500 బిసి కులాలలో, ఇప్పటికీ 1000 కులాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో కనీస ప్రాతినిధ్యం లేదని నివేదించినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు.ఓబిసి జాబితాను వర్గీకరించి రిజర్వేషన్‌లు కల్పించని కారణంగా ఎదిగిన కులాలే, ఎదుగుతున్నాయని, అవకాశాలు ఏమాత్రం రాని కులాలు మరింతగా నిర్వీర్యం అవుతున్నాయని జస్టిస్‌ రోహిణి కమిషన్‌ నివేదికలో స్పష్టం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు.

అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ మంత్రి శ్రీదేవి ప్రసంగిస్తూ

భారతదేశంలో బీసీల జనాభా ఎంత? వారికి అందుతున్న వాటా ఎంత? కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏమి చేస్తోంది? అని మంత్రి శ్రీదేవి ప్రశ్నించారు.

భారతదేశంలో 56 శాతం పైగా బీసీ జనాభా ఉన్నప్పటికీ వారికి బీసీ మంత్రిత్వశాఖ లేదు. దీనిపై బీసీలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉంది. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేకపోవడం వల్ల ఉద్యోగ, పదోన్నతుల్లో బీసీలు అన్యాయానికి గురవుతున్నారు. వీలైనంత త్వరగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ఎంతో మంది నాయకులు మాట ఇచ్చారు. కానీ ఇంత వరకు ఈ హామీ అమలుకు నోచుకోకపోవటం శోచనీయం.

జనాభా గణనలో బిసి కులగణనను చేపడతామని గతంలో అప్పటి హోమ్‌ మంత్రి రాజనాథ్‌ సింగ్‌ స్పష్టంగా హామీ ఇచ్చినప్పటికీ, ఆ నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం ఎందుచేత వెనక్కి తీసుకున్నదో స్పష్టం చేయాలని మంత్రి శ్రీదేవి కోరారు. వచ్చే జనాభా గణనలో ఓబిసి కులగణన చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఓబిసిలకు అమలులో ఉన్న నాన్‌క్రిమిలేయర్‌ ఆదాయ పరిమితిని కేంద్ర డి.వో.పి.టి. గైడ్‌లైన్స్‌ ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పెంపుదల చేయాల్సి ఉన్నా, కేంద్రప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా పెంచడం లేదని మంత్రి శ్రీదేవి విమర్శించారు. ప్రస్తుతం అమలులో ఉన్న 8 లక్షల నాన్‌-క్రిమిలేయర్‌ ఆదాయ పరిమితిని 15 లక్షలకు వెంటనే పెంచాలని డిమాండ్‌ చేశారు.నిధుల కేటాయింపుతో సంబంధం లేని అంశాలను కూడా కేంద్రప్రభుత్వం పరిష్కరించడానికి ముందుకు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఓబిసి ఉద్యోగులు చాలాకాలంగా ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఉద్యోగ నియామకాల్లో బ్యాక్‌లాగ్‌ విధానాన్ని అమలులోకి తేవాలన్న డిమాండ్‌ను కూడా పెడచెవిన పెట్టడమేంటని ప్రశ్నించారు.

 
జాతీయ బిసి దళ్‌ అధ్యకక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రసంగిస్తూ  .

.. కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుకు ఈ వర్గాలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కేంద్రప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కేంద్రప్రభుత్వ వైఖరి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. దేశంలో 75 కోట్ల జనాభా కలిగిన బిసిలకు, భిక్షం వేసినట్లు 2000 కోట్లు ఏటా కేటాయించడం దుర్మార్గమని అన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్‌ల సాధనకు దేశవ్యాప్తంగా బిసి వర్గాల ప్రతినిధులను కూడగట్టి థల వారీగా అనేక ఉద్యమాలను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే కర్ణాటక, తమిళనాడు, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల పర్యటనకు తమ ప్రతినిధి బృందం వెళ్లనున్నట్లు ఆయన వివరించారు.

    ఈ కార్యక్రమంలో
    బిసి ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యకక్షుడు దేవళ్ల సమ్మయ్య ప్రసంగిస్తూ… కేంద్రం ప్రభుత్వ సంస్థలను క్రమంగా ప్రైవేట్‌పరం చేస్తూ, రిజర్వేషన్ల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నదని విమర్శించారు.
 ఈ సమావేశంలో జాతీయ సంచారకులాల సంఘం అధ్యకక్షుడు నరహరి, ఆచార్య భాస్కర్‌, ఆచార్య వెంకటరమణ, ఆచార్య కవిలత, ఆచార్య బాగయ్య, ఆచార్య రవిచంద్ర, ఆచార్య నవీన్‌యాదవ్‌, డా|| గణపతి, హైకోర్ట్‌ న్యాయవాదులు ఓంప్రకాష్‌ యాదవ్‌, సారిక, వివిధ కుల, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల ప్రతినిధులు సాయిపటేల్‌, డా|| దత్తాత్రేయ, డా|| కిరణ్‌, డా|| వెంకటరమణ, డా|| కావ్య, హేమలత, డి.లక్ష్మి, సంగీత, డా|| వర్కాల వసుమతి, కె.రఘుపతి, ఎన్‌.శ్రీనివాస్‌, రమణయాదవ్‌, వి.బి.రమణ, సాయియాదవ్‌, మహేష్‌గౌడ్‌, బోయిని రాజేష్‌, బొద్దం చరణ్‌, దుండ్ర శ్రీయాన్‌, ముచ్చర్ల దీపిక, తదితరులు ప్రసంగించారు. సమావేశంలో 30 కులసంఘాల ప్రతినిధులు, 35 వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమ సమన్వయ కర్తగా జాతీయ బిసి దళ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి సందీప్‌ వ్యవహరించారు.

   

Tags: Former President of the Official Language Associationhas announced support for the BCs' religious struggleMinister Sridevi
Admin

Admin

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు
News

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు

by Admin
03/01/2026
0

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – జాతీయ బీసీ దళ్ ఆధ్వర్యంలో నివాళులు సమానత్వం కోసం పోరాడిన మహనీయ వనిత – దుండ్ర కుమారస్వామి అసమానతలతో నిండిన...

Read more
రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

రాజ్ న్యూస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు

01/01/2026
బ్లిస్‌బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

బ్లిస్‌బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

26/12/2025
Load More

Like Us

Site Map

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News

No Result
View All Result
  • సంపాదకీయం
  • న్యూస్
    • AP
    • Telangana
      • Hyderabad
    • India
    • world
      • సైన్స్ & టెక్నాలజి
      • US
  • రాజకీయాలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • వీడియోలు
  • ఆరోగ్యం
  • వినోదం
  • క్రీడలు
  • ఆద్యాత్మికత
  • ఉద్యోగాలు
  • e-సంచికలు

© 2017 -2021 తొలి పలుకు | Tholi Paluku News