మేమెంతో మా వాటా అంత.. జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
సామాజిక న్యాయం సమానత్వము కోసం- ఓ విప్లవం రావాలి
జనాభాలో 60శాతం పైగా ఉన్న బీసీలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదు
కుల వివక్ష తొలగాలంటే అన్ని రంగాలలో – బీసీ లకు ప్రాతినిధ్యం కల్పించాలి
బీసీల సంఖ్యను బట్టి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వాలి
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల జనాభాను పరిగణలోకి తీసుకుని టికెట్లు కేటాయించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. బీసీ దళ్ తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ రూబిన్ గౌడ్ ను నియమించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రూబిన్ గౌడ్ బీసీల కోసం పనిచేసే యువ నాయకుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు. జాతీయ బీసీ దళ్ కు యువకులే కొండంత అండ.. బీసీలలో చైతన్యం నింపడానికి యువత చేస్తున్న కృషి అభినందనీయమని దుండ్ర కుమారస్వామి అన్నారు.
జనాభాలో 60శాతం పైగా ఉన్న బీసీలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని దుండ్ర కుమారస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనాభా గణన చేపట్టకుండా బీసీల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ ఉందని అన్నారు. భారతదేశంలో బీసీలను నిర్లక్ష్యం చేస్తూ ప్రధాని మోదీ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో 60శాతం పైగా జనాభా ఉన్న బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టాలని అన్నారు. ఐదుశాతం జనాభా ఉన్న కొన్ని సామాజికవర్గాలకు ఊహించని విధంగా పదవులు ఇస్తున్నారని అన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని.. బీసీలు అత్యధిక జనాభా ఉన్న స్థానాలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ అభ్యర్థులను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఎన్నో సార్లు ఎన్నికల సమయంలో బీసీ నాయకులు పదవుల కోసం త్యాగాలు చేశారని.. ఈసారి ఆ పని చేయకండని పలు పార్టీలలో ఉన్న బీసీ నాయకులను కోరారు దుండ్ర కుమారస్వామి. త్యాగాలు చేసి.. చేసి.. మంచి పేరును మాత్రమే మనకంటూ తెచ్చుకుంటున్నాము తప్పితే భవిష్యత్తు తరాలకంటూ సరైన న్యాయం చేయలేకపోతున్నామని అన్నారు దుండ్ర కుమారస్వామి. ఇకనైనా బీసీలు మేల్కొని.. ఇతరుల పల్లకీలను మోయకుంటే చాలని అన్నారు, సిద్ధాంత భావజాలాన్ని దేశమంతా వ్యాప్తి చెందే విధంగా ఉద్యమాలు చేస్తామని తెలిపారు. అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, బీసీల అభ్యున్నతికి పాటుపడేలా ప్రణాళికలు రచించాలని అన్నారు.దేశానికి వెన్నుముక యువత
దేశ నిర్మాణములో కీలక పాత్ర యువత, అలాంటి యువత సామాజిక ఉద్యమాలలో చురుకుగా పాల్గొనాలి అని తెలిపారు.
వచ్చే ఎన్నికల కోసం బీసీలు, బీసీ నేతలు సమాయత్తమవ్వాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే కొందరు రాజకీయ నాయకులు బీసీలపై కపట ప్రేమ కురిపిస్తారని.. అలాంటి వాళ్లకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల జనాభాను పరిగణలోకి తీసుకుని టికెట్లు కేటాయించాలని అన్నారు. జనాభాలో 60శాతం పైగా ఉన్న బీసీలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని దుండ్ర కుమారస్వామి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కులాల వారీగా జనాభా గణన చేపట్టకుండా బీసీల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతూ ఉందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 60శాతం పైగా జనాభా ఉన్న బీసీలకు రాజ్యాధికారం ఉండాలని అన్నారు. తక్కువ శాతం జనాభా ఉన్న కొన్ని సామాజికవర్గాలకు ఎన్నో పదవులు ఇస్తున్నారని.. ఈసారి ఎన్నికల్లో అలా జరగకూడదని అన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని.. బీసీలు అత్యధిక జనాభా ఉన్న స్థానాలలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ అభ్యర్థులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలు ఏకమై బీసీ రాజ్యాధికారం దక్కే దిశగా అడుగులు వేయాలని.. 2024లో బీసీలకు ఇప్పటి కంటే ఎక్కువ పదవులు దక్కాలని ఆకాంక్షించారు దుండ్ర కుమారస్వామి. తక్కువ శాతం ఉన్న వారికే ఈసారి ఎన్నికల్లో పదవులు కట్టబెట్టేలా కాకుండా బీసీలు సంఘటితమై, సమాయత్తమై ఉండాలని అన్నారు.
ఎన్నో సార్లు ఎన్నికల సమయంలో బీసీ నాయకులు పదవుల కోసం త్యాగాలు చేశారని, ఈసారి ఆ పని చేయకండని పలు పార్టీలలో ఉన్న బీసీ నాయకులను కోరారు దుండ్ర కుమారస్వామి. త్యాగాలు చేయడం మానుకుంటేనే.. బీసీ భవిష్యత్తు తరాలకు న్యాయం చేసిన వాళ్ళము అవుతామని అన్నారు దుండ్ర కుమారస్వామి.తెలంగాణలో బీసీల జనాభా దాదాపు 60% ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా సీట్లు సాధించాల్సిందేనని వివిధ పార్టీలలో ఉన్న బీసీ నేతలకు సూచించారు దుండ్ర కుమారస్వామి.ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం 3 స్థానాలను సాధించుకోవాలని.. అప్పుడే బీసీలకు సరైన ప్రాతినిధ్యం లభించినట్లని అన్నారు. బీసీలకు ఎక్కువ స్థానాలు కేటాయించేందుకు పార్టీల రాష్ట్రాధ్యక్షులతో భేటీ నిర్వహించబోతున్నామని దుండ్ర కుమారస్వామి అన్నారు.దశాబ్దాలు గడుస్తున్నా రాజకీయంగా బీసీలకు సరైన ప్రాతినిధ్యం దక్కకపోవడం దారుణమని దుండ్ర కుమారస్వామి అన్నారు. జనాభాలో అందరి కంటే ఎక్కువున్నా.. మొదటి నుంచీ సీట్ల కేటాయింపులో అన్యాయమే జరుగుతోందని అన్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో అయినా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనే డిమాండ్ అన్ని పార్టీల్లోనూ వినిపించాలని అన్నారు. బీసీలకు కూడా జనాభా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. ఆ దిశగా కేంద్రం అడుగులు వేయడం లేదని అన్నారు దుండ్ర కుమారస్వామి. తెలంగాణ ఉద్యమంలో బీసీలదే కీలక పాత్ర. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ నుంచి తొలి అమరుడు శ్రీకాంతాచారి వరకు అందరూ బీసీలే.. కానీ ఎన్నికల్లో పదవులు అనుభవించడానికి మాత్రం బీసీలకు అర్హత లేదా అని ప్రశ్నించారు దుండ్ర కుమారస్వామి.
తెలంగాణ రాష్ట్ర బీసీ దళ్ యూత్ అధ్యక్షుడు రూబీన్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర బీసీ దళ్ యూత్ అధ్యక్షుడు రూబీన్ గౌడ్ మాట్లాడుతూ బీసీ యువతను ఐక్యం చేసి మహాశక్తిగా మార్చి మా హక్కుల కోసం డిమాండ్ల కోసం అనుక్షణం పోరాడుతానని తెలియజేశాడు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ రూబిన్ గౌడ్,మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రమణ యాదవ్ ,యూత్ అధ్యక్షుడు చరణ్, యువనేత గురువయ్య బాలాజీ శివరాం తలసాని సాయి శివారెడ్డి వసంత్ నవీన్ అఖిల్ మాధవ్ రాజేష్ వెంకట్ తదితరులు రాష్ట్రస్థాయిలో పాల్గొన్న యువ నేతలు