మే 13నుంచి ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారీ ఆఫర్లు
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారీ ఆఫర్లు ప్రకటించింది. మే 13నుంచి బిగ్ షాపింగ్ డేస్ సేల్ పేరుతో నాలుగు రోజుల పాటు వివిధ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్‌లపై డిస్కౌంట్‌ను ఇవ్వనుంది. గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్2 ఎక్స్‌ఎల్ ధరలను భారీగా తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు ఉన్నవారు వివిధ వస్తువుల కొనుగోలుపై 10శాతం రాయితీ పొందవచ్చు.
గూగుల్ పిక్సెల్ ధర సుమారు రూ.50వేలు ఉండగా, బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో రూ.34,999లకే లభించనుంది. రూ.17,900 ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్ రూ.10,999కే కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు అనేక మొబైళ్ల ఆఫర్లు కొనసాగుతాయని ఫ్లిప్‌కార్ట్ స్పష్టం చేసింది.
ఇక గేమింగ్ లాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్ యాక్ససరీలపై 75శాతం వరకూ రాయితీని ఇస్తోంది. పవర్ బ్యాంకులు రూ.499కే లభించనున్నాయి. మరోపక్క మే 15న హానర్ 10ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ చేయనున్నారు. దుస్తులు, చెప్పులు, గృహోపకరణాలు, టెలివిజన్‌లు, ఫర్నీచర్, గృహలంకరణ వస్తువులపై కూడా పలు ఆఫర్లు ఉన్నాయి. వీటితో పాటు ఈసారి ప్రత్యేకంగా గేమ్స్ కార్నర్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. దీని ద్వారా రూ.1కే ల్యాప్‌టాప్, మొబైళ్లను గెలుచుకోవచ్చు. అంతేకాదు, 100శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఇందుకు షరతులు వర్తిస్తాయని ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది!