- అరెస్టు అయిన ముద్దాయిల వివరాలు…
- 1) శకుంతల, 2) కిషోర్ 3) రాజు @ నాగరాజు 4) అంజనమ్మ వీరు కర్నూలు, బంగారు పేటకు చెందినవారు.
- 5) గిడ్డయ్య ( కర్నూలు పట్టణం, నిర్మల్ నగర్, )
కర్నూల్: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర, కర్నూల్ జిల్లాలో సుమారు 20 రోజుల క్రితం లేబర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తిని మోసగించి ఇంటికి పిలిపించుకుని అతని నగ్న ఫోటోలు తీసుకుని బెదిరించి అతని వద్ద నుండి బలవంతంగా ఒక లక్ష 20 వేలు తీసుకున్న విషయమై పై తెల్పిన ముద్దాయిలపై కర్నూలు 4 వ పట్టణ పోలీసుస్టేషన్ నందు u/s 347, 384, 506 r/w 34 IPC గా కేసు నమోదు చేయబడినది. అదే విధంగా 09.08.2021 తేదిన రాం, రహీమ్ నగర్ కు చెందిన మరొక వ్యక్తిని కూడా ఇంటికి పిలిపించుకుని అతనిని అర్ధనగ్న ఫోటోలు తీసి సోషల్ మిడియాలో పెడతామని బెదిరించి అతని వద్ద నుండి 4 లక్షల విలువ అయిన 2 ప్రాంసరి నోట్లు, మరియు 4 లక్షలు విలువైన 2 చెక్కులు మొత్తం 8 లక్షల విలువైన ప్రాంసరి నోట్లు, చెక్కులు తీసుకున్నారు.
ఈ విషయమై పైన ముద్దాయిలపై కర్నూలు నాలగవ పట్టణ పోలీసుస్టేషనందు FIR u/sec 347, 384,506, r/w 34 IPC గా కేసు నమోదు చేసి పైన తెల్పిన ముద్దాయిలను రిమాండుకు తరలించడమైనది.
జిల్లా పోలీసు కార్యాలయం నుండి జారీ చేయడమైనది.