సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ కి చెందిన శ్రీ చరణ్ రెడ్డి మలేషియా థాయిలాండ్ బ్యాంకాంగ్ లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో తన సత్తా చాటి బంగారు పతకాన్ని సాధించి ఉత్తమ ప్రతిభ చాటాడు.
మళ్లీ అంతర్జాతీయ పోటీలో భాగంగా శ్రీలంక వెళ్లడానికిఅవకాశం వచ్చినా ఆర్థిక స్థితిగతులు బాగా లేకపోవడం ద్వారా ,పేదరికంతో బాధపడుతున్న తండ్రి మాణిక్ రెడ్డి బాధకు గురైనాడు.తన మిత్రుడి ద్వారా తొలి పలుకు పత్రికను ఆశ్రయించగా వెంటనే స్పందించి తొలి పలుకు పత్రిక సంస్థ ద్వారా ఎడిటర్ దుండ్ర కుమారస్వామి మరియు వెంకటరమణ ,వెంకట్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కేశవరెడ్డి సత్యనారాయణ ,జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్షరాలా పదహారు వేల రూపాయలు 16000RS చెక్కును అందజేసి క్రీడాకారుడ్ని సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా తొలి పలుకు పత్రిక ఎడిటర్ దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డు కావద్దని ఆధునిక జన జీవితంలో క్రీడలు ప్రధాన భాగమనితెలియజేశారు .అంతేకాకుండా క్రీడలు ప్రగతికి బాటలు కావాలని ప్రతి క్రీడాకారుడు లక్ష్యాన్ని సాధించడానికి దృఢసంకల్పంతో ఆత్మవిశ్వాసంతో నిరంతరం పోరాటం చేసి గమ్యం చేరుకోవాలని తెలియజేశారు.
ఎవరైనా కరాటే క్రీడాకారుడికి సహాయపడేవారు క్రింది చిరునామాకు సంప్రదించగలరని తెలియజేశారు.
చిరునామా
నల్లా శ్రీ చరణ్ రెడ్డి
తండ్రి నల్లా మాణిక్ రెడ్డి
తెల్లాపూర్ గ్రామం
సంగారెడ్డి జిల్లా
మొబైల్ నెంబర్ ;9603653051