వెనుకబడిన తరగతులకు చెందిన ,దివాకర్ వృత్తి కూలి పని చేసుకుని,దారిద్ర రేఖకు దిగువన ఉండి ,ఎన్నో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ తన కూతురి సౌందర్యాన్ని ఉన్నత చదువుల నిమిత్తం ఫిలిపిన్స్ లో ఎండీ చదువులకు పంపించాడు. మొదటి సంవత్సరం ఫీజు కూడా చెల్లించడం జరిగింది ..ఆర్థికంగా కుంగిపోవడం వలన రెండో సంవత్సరం ఫీజు కోసమై , వెనుకబడిన తరగతుల విదేశీ చదువులకు ఆర్థిక సహాయం అందించడం కొరకు, బీసీ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, గౌరవ మంత్రి జోగు రామన్న గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
మంత్రి జోగు రామన్న గారు సానుకూలంగా స్పందించి ,ఫిలిపిన్స్ దేశం ఆర్థిక సహాయం నిమిత్తం లిస్టులో లేకున్నా, సిఎం దృష్టికి తీసుకెళ్లి సాయం అందించే ప్రయత్నం చేస్తానని చెప్పి నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూనాము..
ఈ సందర్భంగా మంత్రి జోగు రామన్న పార్లమెంట్ సభ్యుల గోడం నగేష్ అన్న ఎంపీ , మంచిర్యాల శాసనసభ్యులు ఎమ్మెల్యే దివాకర్ రావు, గుండా మల్లేష్ మాజీ ఎమ్మెల్యే మరియు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ను బిసి దల్ రాష్ట్ర అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ..