కరోనా రక్కసి మహిళా జర్నలిస్టు ప్రాణం తీసింది. మేడ్చల్ జిల్లా కొంపల్లి కేంద్రంగా గత 8ఏండ్లుగా “బతుకమ్మ” కేబుల్ టీవి ప్రసారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆ ఛానెల్ నిర్వాహకురాలు కల్పన(40) బుధవారం సాయంత్రం చనిపోయారు. 5 రోజుల క్రితం ఆమెకు కరోనా పాజిటీవ్ రాగా, ఇంట్లోనే ఉంటు మందులు వాడుతూ ఉన్నారు అయితే నిన్న ఆమె ఆక్సిజన్ లేవల్స్ 85కు పడిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు రమంతాపూర్ లో ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆమె ఆకస్మిక మృతి పట్ల “తొలిపలుకు” చీఫ్ ఎడిటర్ దుండ్ర కుమారస్వామి సంతాపం తెలియజేశారు. కల్పన గారు నేటి మహిళలందరికీ గొప్ప ఆదర్శం, ఒక మహిళా జర్నలిస్టుగా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లేది. అలాంటి మంచి మనిషి ఈరోజు కరోనా మహమ్మారి కాటుకు బలైపోవడం సాటి జర్నలిస్టుగా నేను జీర్ణించుకోలేక పోతున్నాను అని వాపోయారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్నీ కుమారస్వామి కోరారు..
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యముడాక్టర్ వకుళాభరణం
సంచార జాతులకు ఆధునిక అభివృద్ధిని అందించడంలో కేంద్రం వైఫల్యం విముక్త, సంచార, అర్థ సంచార జాతుల, కులాల జాతీయ సదస్సులో డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు...
Read more