మాజీ మంత్రి శంకర్రావు (Ex-minister shankarRao) మూడు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అందులో రెండు కేసుల్లో ఆయనను దోషిగా తేల్చారు. మూడవ కేసులో తగిన ఆధారాలు లేవని కొట్టివేశారు. ఆయనను దోషిగా తేల్చిన వెంటనే కోర్ట్ ఆవరణలోనే స్ప్రుహ తప్పి పడిపోయాడు. వెంటనే కోర్టు సిబ్బంది చేరుకుని మంత్రిని లేపి కూర్చోబెట్టి కోలుకున్నాక మంచి నీళ్ళు త్రాగించారు.
ఇందులో మొదటి కేసు భూవివాదానికి సంబందించింది కాగా, రెండో కేసులో ఒక మహిళ ఇంట్లో అక్రమంగా వెళ్ళి బెదిరించారనే ఆరోపణ ఉంది. మొదటి కేసులో రూ.2000, రెండవ కేసులో రూ.1500 గా ప్రజాప్రతినిధుల కోర్టు జరిమానా విధించింది.